మంచిర్యాల కు చెందిన పారా క్రీడాకారుడు రవికిరణ్ కు శనివారం హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ రూ. 10,000 నగదు ప్రోత్సాహకంను హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో అందచేశారు. జపాన్ దేశంలో ఆక్టోబర్ నెలలో నిర్వహించే పారా ఏషియన్ గేమ్స్ లో రవికిరణ్ లాంగ్ జంప్ క్రీడలో తన ప్రతిభను చాటునున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో శిక్షణ పోందుతున్న రవికిరణ్ పారా క్రీడల్లో రాణించాలని హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు . ఈ కార్యక్రమంలో లయన్స్ క్లభ్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ , విష్ణుమూర్తి, ఆవేజ్ తదితరులు పాల్గొన్నారు.